Home >> News >> Films>> కోర్టుకు హాజరైన నటుడు

కోర్టుకు హాజరైన నటుడు
Published Date :8/23/2017 9:35:16 AM
కోర్టుకు హాజరైన నటుడు

నగదు మోసం కేసులో నటుడు దాడి బాలాజీ మంగళవారం తిరుపూర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరయ్యాడు. 2014లో తిరుపూర్‌లోని ఏటీఎంల్లో నగదు నింపేందుకు ఓ ప్రైవేట్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుని ఈ పనిని విష్ణువర్ధన్‌ అనే వ్యక్తికి అప్పగించింది.  అతడు ఆ డబ్బులో రూ.2కోట్లు కాజేసినట్లు నిర్వాహకులు గుర్తించి తిరుపూర్‌ క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణలో విష్ణువర్ధన్‌ కొట్టేసిన సొమ్ములో రూ.5లక్షలు కోవైలో స్టార్‌నైట్‌ కార్యక్రమం నిర్వహించడానికి నటుడు దాడి బాలాజీకి ఇచ్చినట్లు, ఆయితే ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి బాలాజీ  నిరాకరించినట్లు తెలిసింది. దీంతో అతన్ని కేసులో నిందితునిగా చేర్చారు. ఈ కేసు తిరుపూర్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో మంగళవారం విచారణకు రాగా దాడి బాలాజీ విచారణకు హాజరయ్యాడు. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసి, ఆ రోజు మళ్లీ కోర్టుకు హాజరు కావలసిందిగా దాడి బాలాజీని న్యాయమూర్తి ఆదేశించారు.   




Related News Articles