Home >> News >> Films>> స్పీడు పెంచిన 'జై లవ కుశ'

స్పీడు పెంచిన 'జై లవ కుశ'
Published Date :8/23/2017 9:30:59 AM
స్పీడు పెంచిన 'జై లవ కుశ'

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం జై లవ కుశ. పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన జై టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావటంతో వినాయక చవితి సందర్భంగా ఈ 24న లవ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు నెలాఖరుకల్లా కుశ టీజర్ ను కూడా రిలీజ్ చేసి ఆడియో రిలీజ్ కు రెడీ అయ్యే ప్లాన్ లో ఉంది యూనిట్. సెప్టెంబర్ 21న రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ సినిమా ఆడియో వేడుకను సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

 Related News Articles