Home >> News >> Films>> పైరసీని అరికడుతాం!

పైరసీని అరికడుతాం!
Published Date :8/23/2017 7:57:52 AM
పైరసీని అరికడుతాం!

నమస్తే తెలంగాణ: పైరసీని అరికట్టడంలో అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టి, చిత్రరంగాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధకశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫర్ ఇండియన్ కాపీరైట్స్ సంస్థ చైర్మన్ రత్నాకర్, డైరెక్టర్ అరవింద్ మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, సినీకళాకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని తలసాని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో విజిలెన్స్ అడ్మిన్ ఆఫీసర్ శివ, పీఆర్‌వో చంద్రశేఖర్‌శర్మ, బీఆర్ నాయుడు, ప్రతాప్ తదితరులు ఉన్నారు.




Related News Articles