Home >> News >> Cobra News Exclusive>> గొంతు కోసి, కాళ్లు నరికి..

గొంతు కోసి, కాళ్లు నరికి..
Published Date :4/11/2017 7:47:11 AM
గొంతు కోసి, కాళ్లు నరికి..

మహిళ గొంతు కోసి, కాళ్లు నరికి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో జరిగింది. గట్లమల్యాల గ్రామానికి చెందిన దండ్ల రాజు కువైట్‌ వెళ్లడంతో భార్య లావణ్య (28) ముగ్గురు పిల్లలతో కలసి గ్రామంలో ఉంటోంది. ఆదివారం రాత్రి బహిర్భూమికని  వెళ్లిన లావణ్య.. తిరిగి రాకపోవడంతో కాలనీవాసులు చుట్టుపక్కల వెతికారు. గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద లావణ్య మృతదేహం కనిపించింది. తల, రెండు పాదాలు నరికి చెరువు గుంతలోని చెట్లపొదల్లో పడేశారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్స్‌ను రప్పించగా.. చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి.

క్లూస్‌టీం సభ్యులు ఆనవాళ్లను సేకరించారు. కాగా, అదే గ్రామానికి చెందిన రంగు పర్శరాములుగౌడ్‌తో లావణ్యకు వివాహేతర సంబంధం ఉందని, అతడే దారుణంగా హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పర్శరాములును కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని ఆ దుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మృతురాలి కూతురు అంజలి, కుమారులు గణేశ్, శివను ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి హామీ ఇవ్వడం తో వారు శాంతించారు. కాగా,  పర్శరాములుగౌడ్‌ లైంగికదాడి చేసి ఆభరణాల కోసం హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు.
Related News Articles